బాలకార్మికులను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా చైల్డ్ లేబర్ అధికారి దేవేందర్ చారి హెచ్చరించారు. నార్సింగి పరిధిలోని వివిధ షాపులలో స్మైలీ టీమ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.
చైల్డ్ లేబర్ యాక్ట్ కింద..
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు దుకాణాల్లో .. బాలకార్మికులతో పనులు చేయిస్తున్న యజమాన్యాలపై చైల్డ్ లేబర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు చైల్డ్ లేబర్ అధికారి తెలిపారు. చిన్నారులను చైల్డ్ హోమ్‌కు పంపిస్తున్నామని తెలిపిన ఆయన.. చిన్న పిల్లలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి:'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి'