ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. వయసుతో సంబంధం లేకుండా అందరికీ టీకా ఇవ్వాలని కోరారు. రోజూ కోటి వ్యాక్సిన్లు వేసేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఏఐసీసీ పిలుపుతో తాము ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Corona : కరోనా దూరం చేసి కలవరపెట్టింది.. దగ్గరచేసి కలుపుతోంది