ETV Bharat / state

Statue of Equaluity: సమతామూర్తి విగ్రహం లోకార్పణం చేసిన ప్రధాని మోదీ - pm modi

Statue of Equaluity: రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.

Statue of Equaluity: సమతామూర్తి విగ్రహం లోకార్పణం చేసిన ప్రధాని మోదీ

author img

By

Published : Feb 5, 2022, 6:51 PM IST

Updated : Feb 5, 2022, 7:02 PM IST

సమతామూర్తి విగ్రహం లోకార్పణం చేసిన ప్రధాని మోదీ

ఆధ్మాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ముచ్చింతల్‌ భక్త జనసంద్రంగా మారింది. సమతా సూత్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో శనివారం సాయంత్రం కీలకఘట్టం ఆవిష్కృతమైంది. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు. పంచలోహాలతో రూపొంది, కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది.

సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 ఆలయాల నిర్మాణం చేపట్టారు. సమతామూర్తి కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఎల్‌ఈడీ దీపాల కాంతుల్లో కేంద్రం, యాగశాలలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. ప్రత్యేకంగా బెంగళూరుతోపాటు విదేశాల నుంచి తెప్పించిన వందకు పైగా రకాల పుష్పాలతో కేంద్రాన్ని అందంగా అలంకరించారు. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో నిర్విహించిన విష్వక్సేనేష్టి యాగంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో ప్రధానికి.. చినజీయర్‌ స్వామి స్వర్ణకంకణం కట్టారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రధాని ముచ్చింతల్​ పర్యటన సాగిందిలా..

పటాన్​చెరులోని ఇక్రిశాట్​ నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో సాయంత్రం 5గంటలకు ప్రధాని ముచ్చింతల్​కు చేరుకున్నారు. మోదీకి గవర్నర్ , చిన్నజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రాల్లో 5.42గంటలకు యాగశాలకు చేరుకున్న ప్రధాని... ప్రధాన యాగశాలలో విష్వక్సేనేష్ఠి యాగంలో పాల్గొని విశ్వక్సేనుడికి పూజ చేశారు. యాగ ప్రాశస్త్యాన్ని చిన్నజీయర్​ స్వామి ప్రధానికి వివరించారు. ఈ పూజలో ప్రధానితో పాటు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూర్చున్నారు. అనంతరం 108 వైష్ణవ ఆలయాలను ప్రధాని దర్శించుకున్నారు. దివ్యదేశాల విశిష్టతలను కూడా ప్రధానికి చినజీయర్ స్వామి వివరించారు.

అనంతరం భద్రవేదిక మొదటి అంతస్తులో ఉన్న 120 కిలోల సమతామూర్తి బంగారు విగ్రహాన్ని ఆయన సందర్శించారు. ఆ తర్వాత భద్రవేదికపై సమతామూర్తి విగ్రహానికి పూజలు చేశారు. చిన్నజీయర్ స్వామి సమక్షంలో పూజలు నిర్వహించి ప్రధాని లోకార్పణం చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Feb 5, 2022, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.