President Ramnath Kovind Muchintal Visit: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని సమతామూర్తి కేంద్రాన్ని.. మరికాసేపట్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సందర్శించనున్నారు. ఈ మేరకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రపతికి.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన ఆర్మీ హెలికాప్టర్లో ముచ్చింతల్ బయలుదేరారు.
పర్యటన ఇలా
మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్రపతి.. ముచ్చింతల్ చేరుకోనున్నారు. సమతామూర్తి కేంద్రంలోని 108 వైష్ణవ ఆలయాలు, బృహాన్ మూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రామానుజాచార్యుల 120 కిలోల స్వర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించి.. స్వర్ణమూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేయనున్నారు.
రామానుజ 120 ఏళ్ల జీవితానికి గుర్తుగా 120 కిలోల బంగారు విగ్రహం తయారుచేశారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఈ ప్రతిమ కొలువుదీరింది. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా సమతామూర్తి కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు స్వర్ణమూర్తి విగ్రహానికి వేదపండితులు ప్రాణప్రతిష్ఠాపన చేయనున్నారు.
ఇదీ చదవండి: Ramanuja Statue: 120 ఏళ్ల పరిపూర్ణ జీవనానికి ప్రతీక 120 కిలోల సువర్ణ విగ్రహం