రాష్ట్రంలో పుర ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని షాహీన్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. సభకు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. తెరాస, ఎంఐఎం పార్టీలు మైనారిటీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాయని ఆయన ఆరోపించారు.
పేదల, మైనారిటీల అభివృద్ధి కాంగ్రెస్ వల్లే సాధ్యమన్నారు. తెలంగాణ కేబినెట్ తూతూ మంత్రంగా ఉందని ఆరోపించారు. ప్రజలు భయబ్రాంతులకు గురి కావద్దని తాము అండగా ఉంటామని తెలిపారు. తాండూరు, వికారాబాద్, పరిగి, జల్పల్లి తదితర ప్రాంతాలలో కాంగ్రెస్ ముందుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇదీ చూడండి : 'ఓటర్లను మంత్రి ఎర్రబెల్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు'