Police Arrested Drug Gang in Hyderabad : నూతన సంవత్సర వేడుకలపై రాచకొండ పోలీసులు దృష్టి సారించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మాదక ద్రవ్యాల సరఫరాకు పథకం వేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు(Police Commissioner Sudheer Babu) వెల్లడించారు. వీరి నుంచి ఓపీయం డ్రగ్స్ 3.4 కిలోలు, 45 గ్రాముల పాపి స్ట్రాప్ పౌడర్‌తో పాటు 2.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. ఈ కేసులో శశిపాల్ బిశ్ నాయ్, మదనలాల్ బిశ్బాయ్లను అరెస్టు చేశామని పేర్కొన్నారు. వీరు రాజస్థాన్‌కు చెందిన వారని, నగరంలో ఓ ముఠా ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్పారు.
Rachakonda CP Interview over Drugs : గతంలో కూడా ఒకసారి శశిపాల్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యారని సీపీ సుధీర్ బాబు తెలిపారు. నిందితులు ఇతర ప్రాంతాల నుంచి బస్సుల్లో హైదరాబాద్‌కు మాదక ద్రవ్యాలను తీసుకువస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనరేట్‌లో డ్రగ్స్‌ను నిర్మూలించడానికి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఫాంహౌస్‌లు, రిసార్ట్స్,(Resorts) పబ్‌లపై నిఘా పెట్టామని పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు.
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిందన్న సీఎం రేవంత్ - ఖండించిన కేటీఆర్
Awareness for Drug Free in Telangana : ఇప్పటి వరకూ లక్షలు విలువ చేసే మాదక ద్రవ్యాలు(Drugs) స్వాధీనం చేసుకున్నామని సుధీర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారని, దీనిపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని అన్నారు.
'డ్రగ్స్ విక్రయాలు ఎక్కడ జరుగుతాయి, ఏ ప్రదేశాల్లో డగ్స్‌ను ఉపయోగిస్తారు, ఏ వ్యక్తులు ఇటువంటి కేసుల్లో నిందితులుగా ఉన్నారనే వాటిపై మా దగ్గర సమాచారం ఉంది. దాని ఆధారంగా కసరత్తు చేస్తున్నాం. రాష్ట్రంలో డ్రగ్స్ రహితం(Drug Free state) చేస్తాం. ఇతర రాష్ట్రాలకు కూడా డ్రగ్స్‌ను సరఫరా చేయాలంటే రాష్ట్ర రహదారిపై (State Highway)నుంచే పోవాలి. అందువల్ల ఇప్పటి వరకు డ్రగ్స్ ముఠాను పట్టుకుని వాటిని చాలా వరకు సీజ్ చేశాం. మొన్న కూడా ఓఆర్ఆర్ దగ్గర 360 కేజీల గంజాను సీజ్ చేశాం' - సుధీర్‌బాబు, రాచకొండ పోలీసు కమిషనర్.
Anti Drug campaign : కేవలం కమిషనరేట్ పరిధిలో కాకుండా రాష్ట్రంలో ఉన్నతాధికారులందరూ డ్రగ్స్ సరఫరాపై చర్యలు తీసుకుంటున్నారని సీపీ సుధీర్ బాబు తెలిపారు. దీంతో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారే అవకాశం ఉంటుందని అన్నారు.
Maharashtra Drugs Case : నదిలో రూ.కోట్ల విలువైన డ్రగ్స్.. అర్ధరాత్రి ఆపరేషన్.. సీజ్ చేసిన పోలీసులు