ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగింది. ఓ పాదచారి రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం అతన్ని ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన అతన్ని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుడు చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలంగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించామని... ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : గుడికి తీసుకెళ్తానని చెప్పి అత్యాచారం, హత్య