రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో పోలీసు జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన 50 జాగిలాలు ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి.
లాబ్రడార్, జర్మన్ షెపర్డ్, బెల్జియన్ మాలినాల్స్, కాకర్ స్పానియల్, గోల్డెన్ రిట్రీవర్ జాతులకు చెందిన శునకాలు 8 నెలల పాటు శిక్షణ పొందాయి. తెలంగాణ, బిహార్‌కు చెందిన శిక్షకులు వీటికి శిక్షణ ఇచ్చారు. ఈ జాగిలాలను ఐఎస్‌డబ్ల్యూ యూనిట్ల వారిగా కేటాయించనున్నారు.
అనుమానాస్పద వస్తువులు, నేరగాళ్లను గుర్తించేలా జాగిలాలలకు శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. సంఘ విద్రోహ శక్తులు అమర్చే బాంబులను కూడా ఇవి గుర్తించగలవని వెల్లడించారు.
- ఇదీ చూడండి : కాలువలోకి దూసుకెళ్లిన బస్సు