ETV Bharat / state

'అనాథలకు ప్రత్యేక రిజర్వేషన్​ కల్పించాలి' - చాడ వెంకటరెడ్డి తాజా వార్త

పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనాథలకు అండగా నిలవాలని వారికి ప్రత్యేక రిజర్వేషన్​ కల్పించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నాగోల్​లో నిర్వహించిన అనాథల హక్కులకై అంతర్జాతీయ సదస్సు కార్యక్రమంలో చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Orphans International meeting in nagole hyderabad
'అనాథలకు ప్రత్యేక రిజర్వేషన్​ కల్పించాలి'
author img

By

Published : Feb 8, 2020, 9:30 PM IST

రంగారెడ్డి జిల్లా నాగోల్​లోని జె కన్వెన్షన్ హాల్​లో అనాథల హక్కుల సాధనకై అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ, కుడ ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి, ప్రత్యేక జడ్జి ప్రసాద్​రాజు హాజరయ్యారు. గాదె ఇన్నయ్య అధ్యక్షతన రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది.

ఈ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు.. ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అనాథలు అత్యంత దయనీయమైన స్థితిలో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలకు అతీతంగా అండగా ఉండాలని.. అనాథలకు ప్రత్యేక రిజర్వేషన్​ కల్పించాలని కోరారు.

'అనాథలకు ప్రత్యేక రిజర్వేషన్​ కల్పించాలి'

ఇదీ చూడండి: మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.