HMDA LANDS AUCTION: మరోసారి భూముల అమ్మకాలకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ-హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తోంది. దాదాపు రూ. 5 వేల కోట్లు ఆదాయమే లక్ష్యంగా భూములను వేలాం వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో దాదాపు వేయి ఎకరాల వరకు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎలాంటి కోర్టు కేసులు లేని భూములు మాత్రమే అమ్మకానికి అవకాశం ఉంది. అయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ వేయి ఎకరాలను వేలం వేయాలని భావిస్తున్నారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో శివార్లలో దాదాపు 4వేల 500 ఎకరాలు వరకు విలువైన భూములు ఉన్నాయి. కొన్నిచోట్ల హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు సైతం నడుస్తున్నాయి. ఇలాంటి వాటిని పక్కన పెట్టి తొలుత టైటిల్ క్లియర్‌గా ఉన్న భూములను వేలం వేయాలని నిర్ణయించారు. ఇటీవల వివిధ ప్రాంతాల్లో భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి భారీ ఎత్తున ఆదాయం సమకూరింది.
ఇవీ చూడండి: GOVERNOR: తెలంగాణలో బాధ్యతలు నిర్వహించడం ఆనందంగా ఉంది: తమిళిసై
రూ.180 చెప్పులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు.. నవ్వుకున్న పోలీసులే చివరకు..