రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. వర్షం నీరు వెళ్లకుండా నిర్మించిన కట్టడాలను, మట్టికుప్పలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు.
చెరువులు, కుంటలకి నీళ్లు పోకుండా అడ్డుగా నిర్మించిన ఎలాంటి కట్టడాన్ని అయినా తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే మూడు ప్రాంతాలను గుర్తించామని వాటిని కూడా కూల్చివేస్తామని తెలిపారు. ఎవరైనా అక్రమంగా నిర్మిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కూల్చివేత పనులను మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్ పుష్ప శ్రీనివాస్ పరిశీలించారు.
ఇదీ చూడండి: బెడిసికొట్టిన రిపోర్టర్ డీలింగ్... ట్రాప్లో పడి కిడ్నాప్