ETV Bharat / state

విజయారెడ్డి హత్యకేసులో ఇంకెవరైనా ఉన్నారా?

సంచలనం సృష్టించిన తహసీల్దార్‌ విజయరెడ్డి సజీవదహనం కేసులో రాచకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడి బంధువులను విచారించారు. కేవలం సురేశ్​ ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా లేక ఇంకెవరి ప్రమేయమైనా ఉందా... అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆధారాలు సేకరించిన అధికారులు కేసు విచారణను మరింత వేగవంతం చేశారు.

విజయారెడ్డి హత్యకేసులో ఇంకెవరైనా ఉన్నారా?
author img

By

Published : Nov 5, 2019, 11:45 PM IST

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో నిందితుడి నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు... హత్యకు దారి తీసిన కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరగడానికి కొద్దిసేపటి వరకూ అతను ఎవరితో మాట్లాడాడు అనే దానిపై సాంకేతిక ఆధారాలు పరిశీస్తున్నారు. ఇప్పటికే రాచకొండ పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి విచారణ చేపడుతున్నారు. హత్య సురేశ్​ ఒక్కడే చేశాడని నిర్ధారణకు వచ్చిన పోలీసులు..ఘటనకు కారణంగా భావిస్తున్న భూ వివాదానికి సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు. సురేశ్​ తండ్రి కృష్ణయ్య, పెదనాన్నలు దుర్గయ్య, భిక్షపతి, సోదరుడు ఆనంద్​తో పాటు మరి కొంత మంది సన్నిహితులను విచారించిన పోలీసులు కీలక సమాచారం సేకరించారు. హత్యకు మరి కొందరి ప్రోద్బలం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

విజయారెడ్డి హత్యకేసులో ఇంకెవరైనా ఉన్నారా?

ఇవీ చూడండి: లైవ్​ వీడియో: తహసీల్దార్​ను హత్య చేసి దర్జాగా వెళ్తున్న సురేశ్​

TG_HYD_55_05_MRO_MURDER_FOLLOW_UP_PKG_3066407 REPORTER:K.SRINIVAS NOTE:ఫైల్‌ విజువల్స్‌ వాడుకోగలరు. ( ) సంచలనం సృష్టించిన తహసీల్దార్‌ విజయరెడ్డి సజీవదహనం కేసులో రాచకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడి బంధువులను ప్రశ్నిస్తున్నారు. కేవలం సురేష్‌ ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా లేక ఇంకెవరి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆధారాలు సేకరించిన అధికారులు కేసు విచారణను మరింత వేగవంతం చేశారు.....LOOOK V.O: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయరెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్‌ తరపు బంధువులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. సురేష్‌ తండ్రి కృష్ణయ్య, ఇద్దరు పెద్దనాన్నలు దుర్గయ్య, బిక్షపతి, సోదరుడు ఆనంద్‌లను లోతుగా ప్రశ్నిస్తున్నారు. భూ వివాదం నేపథ్యంలోనే సురేష్‌ దారుణానికి ఒడిగట్టాడా, ఎవరి ప్రోద్భలమైనా ఉందా అనే అంశాలపై దృష్టి సారించారు. మరో వైపు నిందితుడి ఫోన్‌ కాల్స్‌ను విశ్లేషిస్తున్నారు. గత వారం రోజుల్లో ఎవరెవరి తో ఎక్కువ సార్లు మాట్లాడాడు, దేని గురించి మాట్లాడాడు అనే విషయాలపై విచారణ జరుపుతున్నారు. విజయరెడ్డి భర్త సుభాష్‌రెడ్డి ఈ ఘటన పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కేవలం సురేష్‌ ఒక్కడే ఈ హత్య చేసి ఉండడని అతని వెనుక మరికొంత మంది ఉండి ఉంటారని ఆరోపించారు. దీంతో పోలీసులు ఈ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. V.O:విజయరెడ్డి అంత్యక్రియలు ఇవాళ నాగోలు శ్మసానవాటికలో నిర్వహించారు. అంత్యక్రియలకు భారీగా రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు తరలివచ్చారు. ఒక దశలో వారు రాస్తారోకో నిర్వహించారు. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వారికి నచ్చ చెప్పడంతో వెనక్కి తగ్గారు. విజయరెడ్డిని కాపాడే యత్నంలో తీవ్రంగా గాయపడిన ఆమె డ్రైవర్‌ గుర్నానాధం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ ఘటనలో గాయపడిన అటెండర్‌ చంద్రయ్య ప్రస్తుతం డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు సురేష్‌ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. E.V.O:కేసు దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.