ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్ల నేడు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పరిధి హిమాయత్‌సాగర్ వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తుందని రంజిత్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల వల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, నాయకులు, జలమండలి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు హిమాయత్‌సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులకు గానూ ప్రస్తుతం 1760 అడుగులకు చేరింది. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందున.. అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇదీచూడండి: బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్: మాజీమంత్రి నాయిని