ETV Bharat / state

షాబాద్​ను పర్యటక ప్రాంతంగా అభివృద్ది చేస్తాం: రంజిత్​రెడ్డి

మంత్రి కేటీఆర్ సహకారంతో 'షాబాద్ 'ను ఒక వైపు పారిశ్రామిక కారిడార్​గా మరొవైపు పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాల్లోని షాబాద్ మండలంలో నిర్మించ తలపెట్టిన పలు అభివృద్ధి పనులకు ఎంపీ శంకుస్థాపన చేశారు.

mp rajinth reddy
షాబాద్​ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేస్తాం: రంజిత్​రెడ్డి
author img

By

Published : Oct 6, 2020, 9:21 AM IST

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నామని చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి తెలిపారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలోని పహిల్వాన్‌ చెరువుకట్టపై రూ.1.25 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ.50లక్షలతో నిర్మించిన పీఏసీఎస్‌ నూతన భవనం, రూ.20లక్షలతో కేశవగూడలో సీసీ రోడ్డు పనులను ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం పహిల్వాన్‌ చెరువు బతుకమ్మ ఘాట్‌ వద్ద పూజలు నిర్వహించారు.

హైదరాబాద్​ నగరంలోని దుర్గం చెరువు మాదిరిగా పహిల్వాన్‌ చెరువును అభివృద్ధి చేసి బోటింగ్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎంపీ రంజిత్​రెడ్డి తెలిపారు. ఎంపీ నిధులతో ఆయా గ్రామాల్లో మిగిలిపోయిన రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. పహిల్వాన్‌ చెరువుకు 400 ఏళ్ల చరిత్ర ఉందని, ఈ చెరువు నిండితే ఆయకట్టు కింద 4 వేల ఎకరాల్లో రైతులు వరిపంట సాగు చేసుకుంటారని వెల్లడించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి, జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డితో పాటు ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: గ్రామకంఠంలోని ఆవాసాలకు పాస్​పుస్తకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.