కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చి మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సుమారు రూ. 3కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు కోమటిరెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పార్టీలకతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎంపీ కోరారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తామన్నారు.
తుర్కయాంజాల్.. పెద్ద మున్సిపాలిటీగా ఏర్పడిందని.. ఇక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీ, బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరముందని ఎమ్మెల్యే వివరించారు. భవిష్యత్తులో మరో రూ. 10కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఏడాదిలోగా శంకుస్థాపన చేసిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఛైర్మన్ మల్‌రెడ్డి అనురాధ, సహకార బ్యాంకు జిల్లా వైస్ ఛైర్మన్ కొత్త కురుమ సత్తయ్య, స్థానిక కౌన్సిలర్లు, తెరాస, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఫైరింగ్ సాధనపై పోలీసులకు సీపీ మెలకువలు