పోలీస్ స్టేషన్ అంటే బాధితుల హడావిడి, సతమతమయ్యే పోలీసులను చూస్తుంటాం. కానీ చేవెళ్లలో వాతావరణం వేరు. సిబ్బంది విధి నిర్వహణలో ఒత్తిడిని జయించేందుకు చేవెళ్ల ఎస్ఐ రేణుక రెడ్డి స్టేషన్లోనే ధ్యానం కోసం, విశ్రాంతి తీసుకునేందుకు, ప్రశాంతంగా భోజనం చేసేందుకు గదులను ఏర్పాటు చేసింది. సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులు సేదతీరేందుకు చెట్ల కింద బెంచీలు ఏర్పాటు చేశారు. పూల మొక్కలు, గడ్డి, సువాసన వెదజల్లే మొక్కలను నాటించారు. సాయంత్రం సిబ్బంది వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడుకునేలా మైదానం ఏర్పాటు చేశారు. స్టేషన్కు వచ్చిన నేరస్తులు మారేందుకు వివేకానందుని సూక్తులను ఏర్పాటు చేశారు. మహిళలు, చిన్న పిల్లలు, పెద్దలకు అవసరమైన చిత్రపటాలను అందుబాటులో ఉంచారు. వచ్చే బాధితుల కోసం రిసెప్షన్లో దినపత్రికలను, మినరల్ వాటర్ ఏర్పాటు చేశారు. వచ్చిన వారి సమస్యలను తీర్చడమే కాకుండా వారికి మంచి వాతావరణాన్ని అందిస్తున్నారు.
ఇవీ చూడండి: భారీ ఎజెండాతో నేడు మంత్రిమండలి భేటీ