మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జల్పల్లి మున్సిపాలిటీ కమిషనర్‌తో కలిసి తన సొంత నియోజకవర్గం షాహీన్‌నగర్ ఖుబకాలనీలో పర్యటించారు. డ్రైనేజీ, చెత్త, మురుగు నీరు, త్రాగు నీటి సమస్యలను అక్కడి స్థానికులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు. హరిత హారంలో భాగంగా మొక్కలను పంపిణీ చేశారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన తెరాస పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఇదీ చూడండి :ముఖ్యమంత్రికి మురికినీటి పార్సిల్ పంపిందెవరు..?