రంగారెడ్డి జిల్లా బాటసింగారం రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో గౌరిల్లి, బాచారం, బండరవీర్యాల గ్రామాలలో ప్రభుత్వ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రారంభించారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యానికి క్వింటాల్కి 1888 రూపాయల మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు దళారుల చేతులో మోసపోకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు.
- ఇదీ చదవండి: తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ