ETV Bharat / state

ఆటో డ్రైవర్​ హత్యకేసులో రంగంలోకి ప్రత్యేక బృందాలు - ఆటో డ్రైవర్​ హత్య

మియాపూర్​లో ఆటో డ్రైవర్​ హత్యకేసులో స్నేహితులే నిందితులు అని పోలీసులు గుర్తించారు. హత్యకు పాతకక్షలే కారణంగా వారు ప్రాథమిక నిర్థారణకొచ్చారు. నిందితుల ఆచూకీ కోసం రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు.

ఆటో డ్రైవర్​ హత్యకేసులో రంగంలోకి ప్రత్యేక బృందాలు
author img

By

Published : Aug 23, 2019, 7:25 PM IST

ఆటో డ్రైవర్​ హత్యకేసులో రంగంలోకి ప్రత్యేక బృందాలు

మియాపూర్​ ధర్మపురి ప్రాంతంలో ఆటోడ్రైవర్​ను అత్యంత పాశవికంగా హతమార్చారు. తల, మొండెం వేరు చేశారు నిందితులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పథకం ప్రకారమే ప్రవీణ్​ను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. పాత కక్షలే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రవీణ్​ స్నేహితులు శ్రీకాంత్​, శ్రీనివాస్​లే హత్య చేసినట్లు ఆధారాలు సేకరించారు.

ప్రత్యేక బృందాలు

శ్రీకాంత్​కు మరో వ్యక్తితో ఏర్పడిన విభేదాలపై ప్రవీణ్​ వారికి నచ్చచెప్పాడు. ప్రవీణ్​ ద్వారా తనను హత్యచేసేందుకు సదరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని భావించిన శ్రీకాంత్​.. తన బావమరిదితో కలిసి హత్యకు పథకం రచించాడు. ధర్మపురిలోని నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి పాశవికంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ఇతరుల ప్రమేయంపైనా ఆరా తీస్తున్నామన్న పోలీసులు.. నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

ఇవీ చూడండి: సోదరుడి భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.