మధ్యప్రదేశ్‌కు చెందిన వీకే సూరజ్ ఇద్దరు కుమార్తెలతోపాటు మరో పాప ఒకేసారి అదృశ్యమవడంతో కలకలం రేగింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వెంకటరమణ కాలనీలో జరిగింది.
సూరజ్ కుమార్తెలు రాణి(5), రాధిక(4) పక్క గుడిసెలో ఉంటున్న పింటూ(7) సహా కనిపించకుండా పోయారు. వారిని ఎవరో అపహరించారనే అనుమానంతో కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.
వారి కోసం కోసం పోలీసులు గాలించగా.. శంకర్‌నగర్ సీసీ పుటేజ్‌లో పిల్లలు రోడ్లపై ఆడుకుంటూ కనిపించారు. వారి వెంట ఎవరూ లేనట్లుగా గుర్తించారు. చివరకు ఆ పిల్లలు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికడంతో కథ సుఖాంతమైంది.
ఇదీ చూడండి : నిందితులు ఎవరైనా వదలిపెట్టం: ఐజీ