పురపాలిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొత్తూరు వాసులను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి కొత్తూరులోని 4, 11, 12 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో అభివృద్ధి ప్రారంభమైందని మంత్రి, ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తాగు, సాగునీటితో పాటు పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తున్నామని వారు స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.