రంగారెడ్డి జిల్లా జల్పల్లి మండలంలోని గరిగుట్ట పెద్దమ్మ ఉత్సవాలకు.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు, తెరాస నేత కార్తీక్‌రెడ్డి హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
ఆదివారం నాడు పోతరాజుల విన్యాసాల నడుమ.. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. 6వ తేదీన మొదలైన ఈ జాతర 8వ తేదీ వరకు జరగనుంది.
ఇదీ చదవండి: పదేళ్లు నేనే ముఖ్యమంత్రి.. ఊహాగానాలపై కేసీఆర్ క్లారిటీ