Minister Sabitha Indrareddy: గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు ఏ విధంగా విజయవంతం చేశారో అలాగే పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి.. పట్టణ ప్రగతి కార్యక్రమాలకు అవసరమైన నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అభయం ఇచ్చారని ఆమె తెలిపారు. ప్రతి డివిజన్‌లో ఉన్న సమస్యలను గుర్తించాలని, సమస్యను బట్టి నిధులు కేటాయిస్తారని పేర్కొన్నారు.
ప్రతి డివిజన్ కార్పొరేటర్లు స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, పార్కులు, స్కూళ్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి డివిజన్‌లో నర్సరీలు ఏర్పాటు చేసుకొని.. రకరకాల మొక్కలను నాటాలని తెలిపారు. హరితహారంలో భాగంగా మొక్కలను పెంచాలని మంత్రి అధికారులు, ప్రజాప్రతనిధులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గ దీపులాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: