రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని ప్రభుత్వ పాఠశాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనిఖీ చేశారు. నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. రెండు మూడు రోజుల్లో పూర్తి హాజరు శాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల అనుమతి పత్రాలతో వచ్చారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో విద్యాలయాల వద్ద పకడ్బందీగా కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని వివరించారు. విద్యార్థులు తప్పనిసరిగా హ్యాండ్ వాష్ చేసుకుని... మాస్క్లు పెట్టుకోవాలని, జ్వరం, జలుబు ఉంటే వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలన్నారు. మధ్యాహ్న భోజనం వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లపై వేరువేరుగా కొవిడ్ జాగ్రత్తలతో ప్రణాళికలు ఉన్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి మధ్యాహ్న భోజనం చేశారు.