రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కురిసిన వడగండ్ల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. ఇంటి పైకప్పులు సైతం విరిగిపోయాయి. నష్టపోయిన వారికి సాయం అందిస్తామంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. గ్రామాల్లో తిరుగుతూ దెబ్బతిన్న పంటలను, ఇళ్లను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి పంటనష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన వారిని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవీచూడండి: మిస్టరీగా మారిన సింగరేణి కార్మికుడు సంజీవ్ అదృశ్యం