రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్‌లోని పదో వార్డులో తెరాస అభ్యర్థులకు మద్దతుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే... వార్డులోని సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని తెలిపారు.
తెరాస అభ్యర్థి పవన్‌కుమార్‌కు పట్టం గడితే.... వార్డులో సీసీ కెమెరాలు, రహదారులు, రవాణా వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే... సంక్షేమ ఫలాలు త్వరగా అందుతాయని మంత్రి పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : ఆ రెండు మున్సిపాలిటీల్లో గెలుపు మాదే: మంత్రి ఈటల