నవంబర్ 15న వరంగల్లో జరిగే విజయ భేరి సభకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి దాదాపు 15 వేల మంది తరలిరావాలని వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. త్వరలోనే ఇబ్రహీంపట్నంకు సాగునీరు రాబోతోందని కొందరు ప్రతిపక్ష నాయకులకు పనిచేయడం చేతకాక కేసులు వేయడం వలన పనులు మెల్లగా జరుగుతున్నాయని అన్నారు. శివన్నగూడెం ఎత్తిపోతల ద్వారా త్వరలో ఇబ్రహీంపట్నం కళకళలాడుతుందని తెలిపారు. ఎవరెన్నీ అడ్డంకులు సృష్టించినా ఈ ప్రాజెక్టు ఆగదని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడాలోని తెరాస పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు.
రాష్ట్రంలో కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని.. షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న ఏం ప్రయోజనమని విమర్శించారు. వందల మంది ప్రాణాలు తెగిస్తే మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామని.. నాడు కాంగ్రెస్ నాయకులు చేసిన మోసమే తెలంగాణ విద్యార్థులను బలిగొన్నదని వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సినీ ఆర్టిస్ట్ శివారెడ్డి కామెడీతో అదరగొట్టగా.. జబర్దస్త్ టీం, కళాకారులు ఆట, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , డీసీసీబీ వైస్ ఛైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: