భూ సమస్యల పరిష్కారం కోసమే ధరణి ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మేము వరద సాయం చేస్తుంటే భాజపా అడ్డుపడిందని ఆరోపించిన ఆయన కేంద్రం ఎలాంటి సాయమందించలేదన్నారు. రాష్ట్రంలో తాగునీరు, కరెంట్ సమస్యలను పరిష్కరించామని కేటీఆర్ వెల్లడించారు.
డిసెంబర్ 4 తర్వాత వరద సాయం అందని వారికి తప్పకుండా సాయం అందిస్తాం. గతంలో కరెంట్ ఉంటే వార్త... కేసీఆర్ పాలనలో కరెంట్ పోతే వార్త. తెలంగాణ మీద సవతి ప్రేమ చూపే కేంద్రం... వేరే రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తోంది. హైదరాబాద్ పచ్చగా ఉందంటే.. సమర్థుడైన నాయకుడు కేసీఆర్ ఉండటం వల్లే సాధ్యమైంది.
--- రోడ్‌షోలో కేటీఆర్
ఇదీ చూడండి: 'కేంద్రమంత్రులరా వెల్కం టూ హైదరాబాద్... పైసలు తీసుకొనిరండి'