Mining Meeting: మైన్స్, క్రషర్ల ఏర్పాటుకు అధికారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. తమకు పరిహారం చెల్లించకుండా భూములు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని రైతులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మైన్స్‌కు సమీపంలోని గ్రామాల ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద రావిర్యాల, చిన్న రావిర్యాల పరిధిలోని కలెక్టర్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.
క్రషర్ల ఏర్పాటుకు అందరి అభిప్రాయాలు సేకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ వెల్లడించారు. నివేదికను పర్యావరణశాఖకు పంపనున్నట్లు ఆయన తెలిపారు. రెండు గ్రామాల పరిధిలో 40 మైన్స్, 17 క్రషర్ మిషన్ల ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. అయితే పర్యావరణానికి హాని కలిగించే మైన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
లీజులను పునరుద్ధరించొద్దని అధికారులకు విన్నవించారు. మరోవైపు క్రషర్ కూలీలు, యజమానులు సైతం క్రషర్లను కొనసాగించాలంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ డీసీపీ సంపత్ సింగ్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట చారి, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి వెంకన్న పాల్గొన్నారు.
ఇవీ చదవండి: వరదలో బైక్‌తో సహా చిక్కుకున్న వ్యక్తి.. కాపాడిన పోలీసులు.. సీపీ అభినందనలు
ఇంటి కింద పది కోట్లు.. ఒకే చెట్టుకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉరి!