తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ట్రావెల్స్ యజమానులు పాలాభిషేకం చేశారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా మార్చి నుంచి ఆగష్టు వరకూ ఆరు నెలలుగా రూ.267 కోట్ల టాక్సీ డబ్బులు చెల్లింపులను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించినందుకుగానూ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
కేసిఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నామని అసోసియేషన్ నాయకులు తెలిపారు. సీఎం నిర్ణయంతో టాక్సీ వాహనాల యజమానులకు కొంత ఉపశమనం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: రెండు పడక గదుల ఇళ్ల కోసం కొట్లాడుతా: వెల్డండ వెంకటేశ్