ETV Bharat / state

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు విస్తరణ పనులు: కొప్పుల నరసింహా రెడ్డి

author img

By

Published : Jul 26, 2022, 6:34 PM IST

Corporater on Road Works: మన్సూరాబాద్ డివిజన్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కార్పొరేటర్ కొప్పుల నరసింహా రెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ పరిధిలోని పలు కాలనీల్లో ఆయన పర్యటించారు.

Mansurabad
కొప్పుల నరసింహా రెడ్డి

Corporater on Road Works: రోడ్డు విస్తరణ పనులను మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పర్యవేక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇవాళ హయత్ నగర్ పరిధిలోని పుల్లారెడ్డి స్వీట్ హౌస్ నుంచి బాలాజీ నగర్, ఆదిత్య నగర్, లెక్చరర్స్ కాలనీ, బొమ్మల గుడి, ఇతర కాలనీలకు వెళ్లే సీఆర్​ఎంపీ రోడ్డును మూడు అడుగులు విస్తరణ చేపట్టాలని తెలిపారు.

రోడ్డు విస్తరణ పనుల్లో ఇళ్ల ముందు కట్టిన ర్యాంపులను, రోడ్డుపై చెట్ల కొరకు పెడుతున్న గోడలను తొలగించాలని సూచించారు. రోడ్డు విస్తరణకు కాలనీ వాసులందరూ సహకరించి ట్రాఫిక్ ఇబ్బందులకు తలెత్తకుండా చూడాలన్నారు. అదేవిధంగా డివిజన్ ప్రజలందరూ ఇళ్లల్లో చెత్తను రోడ్డుపై పడేయొద్దని సూచించారు. మీ వద్దకే వస్తున్న జీహెచ్​ఎంసీ చెత్త సేకరణ బండిలోనే వేయాలన్నారు. లేనియెడల రోడ్డుపై ఎవరైనా చెత్త పడేస్తున్నట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ నరసింహారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్​ఎంసీ వర్క్ ఇన్​స్పెక్టర్​ సీతారాం, సీఆర్​ఎంపీ సూపర్​వైజర్, వివిధ కాలనీల అధ్యక్షులు, కాలనీవాసులు, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

ఇవీ చదవండి: రాష్ట్రాన్ని వణికిస్తోన్న వానలు.. స్తంభించిన జనజీవనం..

మూడు రోజుల క్రితమే పెళ్లి.. కూతురు, అల్లుడిని కొడవలితో నరికి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.