రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 11 గంటలైనా... పోలింగ్ కేంద్రాల వద్దకు ఒక్కొక్కరుగా ఓటర్లు చేరుకుంటున్నారు.
మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 40వేల మంది ఓటర్లున్నారు. అరవై పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.