రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆరాంఘర్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. శంషాబాద్ నుంచి ఇటుకల లోడుతో నగరానికి వస్తున్న లారీ అదుపుతప్పి ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన నిర్మాణంలో ఉన్న కల్వర్ట్లోకి దూసుకెళ్లింది.
ప్రమాదంలో శంషాబాద్ మండలం నాగారం తండాకు చెందిన శంకర్ నాయక్ మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.