రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్, అంబేడ్కర్ చౌరస్తా, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ఎస్పీ రాహుల్ హెగ్డే ఆకస్మిక తనిఖీ చేశారు. పాత బస్టాండ్ ప్రాంతంలో పలు వాహనదారులను అపి తనిఖీ చేసి వారి వివరాలు, బయటకి రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని చెప్పారు.
లాక్డౌన్ను రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో కచ్చితంగా అమలు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆస్పత్రులు, మెడికల్ షాపులు, మీడియాతో పాటు వ్యవసాయ అనుబంధ సంస్థలకు మాత్రమే లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉందని తెలిపారు. జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు లాక్డౌన్ పాటించి పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని ఎస్పీ కోరారు.
- ఇదీ చదవండి కరోనా కష్టాలు: మాటలే.. చేతలేవి!