ETV Bharat / state

మరో లేగ దూడపై చిరుత దాడి, కడ్తాల్​లో భయం

రంగారెడ్డి జిల్లా కడ్తాల్​లో మరో లేగదూడపై చిరుత దాడి చేసింది. ఇప్పటికే 17 లేగదూడలను పొట్టనపెట్టుకున్న చిరుత తాజాగా మరోదూడను చంపేసింది. మూడు నెలలుగా  కంటిమీద కునుకు దూరం చేస్తున్న చిరుతను  అధికారులు ఏమీ చేయలేకపోతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

lepord-attach
author img

By

Published : May 12, 2019, 10:33 AM IST

రంగారెడ్డి జిల్లా కడ్తాల్​ మండలం మైసిగండిలో లేగదూడపై చిరుతదాడి చేసింది. రైతు బోలానాయక్​కు చెందిన రెండో లేగదూడను చిరుత హతమార్చింది. గత మూడు నెలలుగా కడ్తాల్​, యాచారం, కందుకూరు మండలాల్లో రైతులకు కంటిమీద కునుకుదూరం చేసింది. ఇప్పటివరకు 18 లేగదూడలను హతమార్చింది. అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు స్పందించడంలేదని రైతులు వాపోతున్నారు. కడ్తాల్​, గోవిందాయపల్లి, ముద్విన్​, చర్వికొండ, కొర్షకొండలో బోన్లు ఏర్పాటు చేసినప్పటకీ చిక్కడం లేదు. చిరుత సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

మరో లేగ దూడపై చిరుత దాడి
ఇదీ చదవండి: 'చిరుత కోసం వేట'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.