ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాలను ప్రభుత్వం క్రమంగా నెరవేరుస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో 2.63 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. కిస్మత్‌పూర, బండ్లగూడ గ్రామాలలో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. హిమాయత్ సాగర్, కిరణ్ చెరు ప్రాంతాల్లో సీసీ రోడ్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలు ప్రతి సమస్యను తన దృష్టికి తెచ్చిన వెంటనే సమస్యను తీర్చేందుకు ప్రయత్నిస్తానని ప్రకాష్ గౌడ్ అన్నారు.
ఇది చూడండి: 'వచ్చే రెండు రోజుల్లో మంత్రి మండలి సమావేశం'