ETV Bharat / state

Ktr on Medha Rail Coach Factory: 'మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకే తలమానికం' - Medha Rail Coach Factory kondakal

Ktr on Medha Rail Coach Factory: రాష్ట్రంలో మరో భారీ సంస్థ ప్రారంభం కాబోతుంది. త్వరలో ప్రారంభం కాబోతున్న మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఫౌండర్ ఎడవల్లి యుగంధర్ రెడ్డికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Medha
Medha
author img

By

Published : Feb 6, 2022, 4:07 PM IST

Ktr on Medha Rail Coach Factory: భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీలలో ఒకటైన మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ప్రారంభం కానుండడం గర్వకారణంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు మంత్రి ట్విట్టర్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. రెండేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా కొడంకల్‌లో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. భూమిపూజ చేసిన దగ్గరి నుంచి నిర్మాణ పనులను మేధా సంస్థ వేగంగా పూర్తిచేసుకుంది.

మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీ
మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీ

2వేల మందికి ఉపాధి...

త్వరలో ప్రారంభం కాబోతున్న మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఫౌండర్ ఎడవల్లి యుగంధర్ రెడ్డికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. సుమారు 800 కోట్ల రూపాయలతో మేధా కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల సుమారు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. రైల్ కోచ్‌లు, మెట్రో కోచ్‌లు ఇక్కడ తయారు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా కొండకల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకీ ఇటీవలే భూమి చేశారు.

Ktr
కేటీఆర్ ట్వీట్

1984లో ప్రారంభం...

1984లో మేధా సంస్థ ఆవిర్భవించింది. గడిచిన 15 ఏళ్లపాటు ఇండియన్ రైల్వే ఆమోదం, గుర్తింపు పొందేందుకు చాలా కృషి చేసినట్లు మేధా సంస్థ యాజమాన్యం పేర్కొంది. 2005లో సుమారు రూ. 25 కోట్ల టర్నోవర్‌తో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గడిచిన 17 ఏళ్ల కాలంలో 12 ఫ్యాక్టరీలతో నాలుగైదు ఖండాల్లో మేధా సంస్థ విస్తరించింది.

Medha
Medha

ఇదీ చదవండి: "సమానత్వంపై మాట్లాడుతున్న కేసీఆర్​.. మోదీని ఎందుకు అడగలేదు.?"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.