Bicycle track along ORR: మహానగరంగా విస్తరించిన హైదరాబాద్ నగరంలో రవాణాకు మరో నూతన మార్గం అందుబాటులోకి రానుంది. రేపు ఔటర్ రింగ్ రోడ్డు వెంట(ORR) వరల్డ్ క్లాస్ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ORR వెంట తొలి విడతగా 23 కిలో మీటర్ల మేర 4.5 మీటర్ల వెడల్పుతో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మించనున్నారు.
మొదటి దశ కింద ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి నానక్ రామ్‌గూడ నుంచి కొల్లూరు వరకు సైకిల్ ట్రాక్ నిర్మాణం చేస్తారు. ఈ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నుంచి 16మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. సైకిల్‌పై సవారీ చేయలకునే వారి కల 2023 వేసవి నాటికి తీరుతుందని మంత్రి కేటీఆర్ హామీ ఇస్తున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్ కూడా చేశారు.
-
Correction, it’ll be a 23 kms, 4.5 metres wide bicycle track along #ORR (Nanakramguda -TSPA & Narsingi-Kollur stretch) & will have solar panels generating 16 MW
— KTR (@KTRTRS) September 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Some images of the demo stretch 👍
One of its kind in India & will be ready by early 2023@HMDA_Gov@arvindkumar_ias pic.twitter.com/RpsCRjXrdi
">Correction, it’ll be a 23 kms, 4.5 metres wide bicycle track along #ORR (Nanakramguda -TSPA & Narsingi-Kollur stretch) & will have solar panels generating 16 MW
— KTR (@KTRTRS) September 5, 2022
Some images of the demo stretch 👍
One of its kind in India & will be ready by early 2023@HMDA_Gov@arvindkumar_ias pic.twitter.com/RpsCRjXrdiCorrection, it’ll be a 23 kms, 4.5 metres wide bicycle track along #ORR (Nanakramguda -TSPA & Narsingi-Kollur stretch) & will have solar panels generating 16 MW
— KTR (@KTRTRS) September 5, 2022
Some images of the demo stretch 👍
One of its kind in India & will be ready by early 2023@HMDA_Gov@arvindkumar_ias pic.twitter.com/RpsCRjXrdi
ట్రాక్ వెంట భద్రత కోసం 24/7 పనిచేసే CCTVలను కూడా అమర్చనున్నారు. ఈ CCTVలను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేసి భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఐటీ నిపుణులను దృష్టి ఉంచుకుని తొలి దశ నిర్మాణాన్ని చేపడుతున్నారు. దేశంలోనే ఐటీ రంగానికి కీలక స్థానంగా ఉన్న హైదరాబాద్‌లో ఇలాంటి విన్నూత ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాలతో హైదరాబాద్ నగరం మినీ ఇండియాలాగా ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాకుండా, విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ ఎంతో సౌకర్యంగా, ప్రశాంతంగా జీవనం గడుపుతారు. అందుకే వివిధ రంగాల్లో నిపుణులు హైదరాబాదులో ఉద్యోగం, వ్యాపారం చేయడానికి, ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు.
ఇలాంటి సహజ సిద్ధమైన అనుకూలతలతో పాటు మౌలిక వసతులు కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. తొలి దశ నిర్మాణాన్ని 2023 వేసవి నాటికి అందుబాటులోకి తెచ్చి అటు తర్వాత మొత్తం ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ సైకిల్ ట్రాక్ విత్ సోలార్ రూఫ్ టాఫ్ చేయాలని పట్టాభివృద్ధి శాఖ నిర్ణయించింది. తొలి దశ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్మాణం చేపట్టడం ద్వారా హైదరాబాద్ మహానగర ప్రతిష్ఠ మరింత ఇనుమడించనుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సైకిలిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.