ETV Bharat / state

చేవెళ్లలో దళితులందరికి ఒకే విడతలో దళితబంధు మంజూరు చేస్తాం : కేసీఆర్ - చేవెళ్లలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

KCR Praja Ashirvada Sabha at Chevella : చేవెళ్ల నియోజకవర్గ దళిత వాడల దరిద్రాన్ని పోగొట్టేలా.. ఒకే విడతలో దళిత బంధు సైతం త్వరలోనే విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, చేవెళ్లలో పర్యటించిన కేసీఆర్.. రైతుబంధు నిలిపివేతపై అసహనం వ్యక్తం చేశారు. రైతుబంధు విషయంలో తెలంగాణ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు చేసినా.. అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్​నే అని.. డిసెంబర్ 6 నుంచి రైతుబంధు ఇవ్వటం ఖాయమని కేసీఆర్ పేర్కొన్నారు.

Telangana Assembly Election 2023
KCR Praja Ashirvada Sabha at Chevella
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2023, 4:55 PM IST

KCR Praja Ashirvada Sabha at Chevella : చేవెళ్ల నియోజకవర్గ దళిత వాడల దరిద్రాన్ని పోగొట్టేలా.. ఒకే విడతలో దళిత బంధు(Dalit Bandhu Scheme) సైతం త్వరలోనే విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ , చేవెళ్లలో పర్యటించిన కేసీఆర్.. రైతుబంధు నిలిపివేతపై అసహనం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు వారి పార్టీల దృక్పథం, చరిత్ర చూడాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు.

చేవెళ్లలో దళితులందరికి ఒకే విడతలో దళితబంధు మంజూరు చేస్తాం : కేసీఆర్

CM KCR on Rythu Bandhu Fund Release Issue : ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఆయన విరుచకుపడ్డారు. కాంగ్రెస్ ఫిర్యాదు వల్లే రైతుబంధు నిలిచిపోయిందని ఆరోపించారు. రైతుబంధు విషయంలో తెలంగాణ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కాంగ్రెస్(Congress Party) ఎన్ని కుయుక్తులు చేసినా.. డిసెంబర్ 3 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. డిసెంబర్ 6 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయటం ఖాయమని చేవెళ్ల బహిరంగ సభలో కేసీఆర్ పేర్కొన్నారు.

రైతుబంధుపై ఇచ్చిన ఆదేశాలు ఉప సంహరించుకోండి - ఈసీకి బీఆర్​ఎస్​ విజ్ఞప్తి

KCR Fires on Congress Party : నాడు రంగారెడ్డి జిల్లాలో సాగునీరు, తాగునీరుకు ప్రజల తీవ్ర అవస్థలకు.. నేటి పరిస్థితులకు బేరీజు చేయాలని ప్రజలను కోరారు. రైతుబంధు నిలిపివేస్తే కాంగ్రెస్​కు ఓట్లు పడుతాయని భావిస్తున్నారని.. రైతులు(Farmers) ఈ విషయాన్ని ఆలోచించాలని కోరారు. రైతుబంధు ఇప్పుడు కొత్తగా ఇచ్చేది కాదని.. ఆరుసార్లు ఇచ్చామని పేర్కొన్న కేసీఆర్.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వెల్లడించారు.

చేవెళ్ల నియోజవర్గ ప్రజలకు నూటికి నూరు శాతం దళిత బంధు వచ్చేలా నేను పెడతాను. ఈ నియోజకవర్గ దరిద్రమంతా పీకి అవతల పడేద్దాం. మీ అందరికీ ఒకటే విడతలో దళిత బంధు మంజూరు అయ్యేలా చేస్తానని నేను మనవి చేస్తున్నాను. అదే విధంగా పాలమూరు నీరు తీసుకుచ్చే బాధ్యత నాది. రెండోది మీ 111 జీవోను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లో పరిష్కరించే బాధ్యత నాది. -కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి

Telangana Assembly Election 2023 : అలాగే షాద్ నగర్ వరకు మెట్రోరైలును విస్తరిస్తామని.. చేవెళ్లలో 111జీవో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. చేవెళ్లలోని దళితులందరు వేరే పార్టీకి ఓటు వేయవద్దని కోరిన కేసీఆర్.. ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఒకే విడతలో చేవెళ్లకు దళితబంధు మంజూరు(Sanction) చేస్తామని ప్రకటించారు. కొన్ని నెలల్లోనే పాలమూరు- రంగారెడ్డి నీళ్లు వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు ఉప్పొంగుతాయని కేసీఆర్ అన్నారు.

మళ్లీ అధికారంలోకి రాగానే మొత్తం అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని తెలిపారు. తాను అందరికి ఆర్డర్ వేస్తే చేవేళ్ల ఎమ్మెల్యే యాదయ్య మాత్రం.. తనకు ఆర్డర్ వేస్తారని అంతటి సాంగత్యం యాదయ్య తనకు ఉందని గుర్తు చేశారు. అటువంటి అభ్యర్థిని(MLA Candidate) గెలిపించుకుంటే నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. తాను కూడా అన్ని విధాలుగా సహకరిస్తానని కేసీఆర్ ప్రజలకు మనవి చేశారు.

తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గొంతు నొక్కాలని చూస్తున్నారు : కేటీఆర్

పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించిన బీఆర్​ఎస్ ​- హైదరాబాద్‌లోని వార్‌రూం నుంచి పర్యవేక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.