భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మీర్పేట్ నగర పాలక సంస్థ కమిటీ కార్యదర్శిగా కర్నకంటి లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ మేరకు నగర పాలక సంస్థ అధ్యక్షుడు రమేశ్ ముదిరాజ్ నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓబీసీ మోర్చా మీర్పేట్ కార్యదర్శిగా నియమించటం పట్ల లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భాజపా విజయమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. దుబ్బాక ఎన్నికల ఫలితాన్ని పునరావృత్తం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్