Journalist Shankar dies of heart attack: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామానికి చెందిన జర్నలిస్టు శంకర్.. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిజం రంగంలో ఉన్న శంకర్.. ప్రస్తుతం ఓ భక్తి ఛానల్లో పని చేస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనతో అనేక కార్యక్రమాలు చేపట్టాడు. ప్రజాశేయస్సు కోసం నిరంతరం పని చేశారు. గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందటం పట్ల గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
శంకర్ కుటుంబాన్ని ఆదుకోవాలి : శ్రీనివాస్ నాయక్, మాజీ ఎంపీపీ
జర్నలిజంలో నిస్వార్థంగా రాణించిన శంకర్ నాయక్ జీవితం.. ఎంతో మందికి స్ఫూర్తిమంతం అని మంచాల మండల మాజీ ఎంపీపీ, గిరిజన సంఘ నాయకులు శ్రీనివాస్ నాయక్ అన్నారు. శంకర్ నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవటంతో పాటు డబుల్ బెడ్ రూం ఇళ్లును మంజూరు చేయాలని కోరారు. శంకర్.. ఇద్దరు పిలల్ల చదువుకు సర్కార్ భరోసా ఇవ్వాలని, భార్యకు ఏదైనా ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: