ETV Bharat / state

Job Connect : ‘పక్కా లోకల్‌’ యువతకి ‘జాబ్‌ కనెక్ట్‌’తో కొలువులు..!

ఉన్నత చదువులవాళ్లు, ర్యాంకర్లూ ప్రైవేటు సంస్థల్లో ఎలాగోలా ఉద్యోగం సాధిస్తారు. కష్టపడి పోటీ పరీక్షలు రాసేవాళ్లూ ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం కొట్టేస్తారు. కానీ మన యువతలో ఇలాంటివాళ్లు ఇరవై శాతం కూడా ఉండరు! మరి అంతంతమాత్రం చదువులతో అత్తెసరుగా ఉన్న 80 శాతం మంది పరిస్థితేమిటీ... వాళ్ల ఉద్యోగాల మాటేమిటీ? ఈ ప్రశ్నే వేసుకున్నారు హైదరాబాద్‌ నగర పోలీసులు. ‘జాబ్‌ కనెక్ట్‌’ (Job-Connect) పేరుతో అందుకు తామే ఓ పరిష్కారాన్ని కనిపెట్టారు. దాని ద్వారా ఇప్పటిదాకా 15 వేల ఉద్యోగాలు ఇప్పించి... యువతరానికి ప్రియనేస్తాలయ్యారు!

Job Connect
Job Connect
author img

By

Published : Nov 28, 2021, 4:52 PM IST

Job-Connect: అదో చిన్న గ్రామం. దాని పేరు బాటసింగారం . హైదరాబాద్‌ శివారున... విజయవాడ వెళ్లే రహదారిలో ఉంటుంది. అమెజాన్‌ సంస్థ ఈ మధ్య ఇక్కడో గొడౌన్‌ని ఏర్పాటుచేసుకుంది. అక్కడ పనిచేయడానికి సిబ్బంది అవసరమయ్యారు. హైదరాబాద్‌ నగరంలో ఉన్న యువకులు ఎలాగూ 20 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి రారు కాబట్టి బాటసింగారం గ్రామం చుట్టుపక్కల ఉన్నవాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలనుకుంది అమెజాన్‌. కానీ ఈ గ్రామీణ ప్రాంతంలో తమ వేర్‌హౌస్‌ని చూసుకోగల నమ్మకస్తులైన, కాస్తోకూస్తో చదువుకున్న ఉద్యోగులు ఎలా దొరుకుతారు? ఇక్కడే హైదరాబాద్‌ నగర పోలీసులు ఆ సంస్థకి సాయపడ్డారు. ‘జాబ్‌ కనెక్ట్‌’ ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో చదువుకున్న యువతని అమెజాన్‌లో ఉద్యోగానికి కుదిర్చారు (employment at batasingaram ). పోలీసుల ద్వారానే వచ్చారు కాబట్టి... అమెజాన్‌కి ఉద్యోగుల నడతపైన భయపడాల్సిన అవసరం రాలేదు. చిన్నదే అయినా... స్థానిక యువతీ యువకులకీ ఉద్యోగమూ దొరికింది. ఒక్క హైదరాబాద్‌ శివార్లలోనే కాదు ఆ నగరం లోపలా ‘పక్కా లోకల్‌’ యువతకి ఉద్యోగాలిప్పిస్తున్నారు సిటీ పోలీసులు. ఇందుకోసం ‘జాబ్‌ కనెక్ట్‌’ కార్యక్రమం ద్వారా బిగ్‌బజార్‌, రిలయన్స్‌, మోర్‌, జీఈ వంటి 70 పెద్ద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

‘జాబ్‌ కనెక్ట్‌’తో కొలువులు
‘జాబ్‌ కనెక్ట్‌’తో కొలువులు

ఏమిటీ ‘జాబ్‌ కనెక్ట్‌’...?

ఇదో ఉచిత ‘జాబ్‌ కన్సల్టెన్సీ’ వంటిదే కానీ... దీని సేవలు అంతకన్నా విస్తృతమైనవి. పోలీసుల్లోని సున్నిత మానవీయ కోణాన్ని ఆవిష్కరించేవి కూడా. ఏ నగరమైనా అక్కడ అల్లర్లూ, అనవసరమైన గొడవలూ, నేరాల్లాంటి వాటిలో నిరుద్యోగ యువత పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో చదువు సాగక, ఉద్యోగావకాశాలు రాక, కనీస అవసరాలు తీరక నిరాశానిస్పృహలో కొట్టుమిట్టాడే యువత... ఇట్టే అసాంఘిక శక్తుల ప్రభావానికి లోనవుతుంటారు. నిజానికి ఇలాంటి నేరాల్లో సూత్రధారులు ఎక్కడో ఉంటే... కేవలం పాత్రధారులైన యువకులు భవిష్యత్తుని కోల్పోవడాన్ని పోలీసులు ఎన్నో కేసుల్లో చూశారట. అలాంటివాటిని కట్టడి చేయాలంటే యువతకి కాస్త గౌరవనీయమైన ఆర్థిక భరోసా ఉండాలనుకున్నారు. దాంతోపాటూ ఓ మంచి ఉద్యోగ వాతావరణానికి అలవాటుపడే యువతలో ఇలాంటి నేరాలూ తగ్గడం గమనించారు. అందుకే చిన్నపాటి ఉద్యోగాలు ఇవ్వగల పెద్ద సంస్థలూ, తక్కువ చదువున్న ఉద్యోగార్థుల్నీ ఒకే వేదికపైకి తీసుకురావాలనుకున్నారు. ఆ ఆలోచన ఫలితమే ‘జాబ్‌ కనెక్ట్‌’. గత మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని పోలీసులు అమలు చేస్తున్నారు. ఇప్పటిదాకా 15 వేల మందికి ఉద్యోగాలు ఇప్పించారు... ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపారు.

వీధివీధికీ వెళ్తున్నారు!

సాధారణంగా ఏ ఉద్యోగం కావాలన్నా మనమే ఆయా సంస్థల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఆ అవసరం లేకుండా ఈ ‘జాబ్‌ కనెక్ట్‌ ద్వారా పోలీసులే హైదరాబాద్‌లోని వీధివీధికీ వెళ్లి యువత వివరాలని నమోదు చేసుకుంటున్నారు. ఈ విషయంలో పోలీసులకి ‘టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఇంటర్నేషనల్‌’ (Talent Management Management International) అన్న కన్సల్టెన్సీ సంస్థ సాయపడుతోంది. ఆ సంస్థతో కలిసి నగర పోలీసు విభాగం ‘ఉద్యోగ రథం’ పేరుతో వాహనాలని ఏర్పాటుచేసింది. ఈ వాహనాలని వారం వారం ఓ ప్రాంతానికి తీసుకెళతారు. అక్కడ వీధీవీధీ తిరిగి నిరుద్యోగ యువతని ఉద్యోగాల కోసం వివరాలని నమోదు చేసుకోమంటారు. టెన్త్‌, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసిన వాళ్లు ఎవరైనా ఇందులో పేర్లు నమోదుచేసుకోవచ్చు. వాళ్ల వివరాలని ప్రైవేటు సంస్థలకి చేరవేస్తారు. వాళ్లు ఆ జాబితా నుంచి సిబ్బందిని సెలెక్ట్‌ చేసుకుని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థుల తరఫున ఆయా సంస్థలకి పోలీసులే గ్యారెంటీ కూడా ఇస్తున్నారు!

అన్నట్టు.. గత ఆరునెలలుగా ‘జాబ్‌ కనెక్ట్‌’కి అమ్మాయిలూ ఎక్కువగా వస్తున్నారు. పదో తరగతి అర్హత లేకున్నా చిన్నపాటి కుట్లూ అల్లికలూ తెలిసినా సరే... నెలకి కనీసం రూ.15 వేల జీతం వచ్చేలా చూస్తున్నారు పోలీసులు. ఆ మాటకొస్తే... పోలీసులు జాబ్‌ కనెక్ట్‌తో ఇప్పిస్తున్న ఉద్యోగాల్లో చాలావరకూ పాతికవేలకన్నా ఎక్కువ జీతం ఉన్నవి కావు! అయితేనేం, తమకు ఏ ఉద్యోగమూ రాదన్న నిరాశలో కూరుకుపోయినవాళ్లకి ఆ పాటి జీతం ఇచ్చే ఆత్మవిశ్వాసం... ఉద్యోగం అందించే భరోసా... సామాజికంగా అద్భుతమైన ఫలితాలని ఇస్తున్నాయంటున్నారు పోలీసులు. అంతకంటే ఏం కావాలి...!

ఇదీ చూడండి: TRS Parliamentary Party Meeting: తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ.. ఎంపీలకు సీఎం దిశానిర్దేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.