ETV Bharat / state

Sabita visit: జల్​పల్లి చెరువు రాక్ గార్డెన్​కు రూ.9కోట్ల నిధులు - జల్ పల్లి చెరువుకు నిధులు విడుదల

జల్​పల్లి చెరువుకు పర్యాటక శోభ కోసం కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చెరువు వద్ద రాక్ గార్డెన్ నిర్మాణానికి రూ.9కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి తెలిపారు.

minister
minster
author img

By

Published : May 27, 2021, 8:18 PM IST

జల్ పల్లి చెరువు వద్ద రాక్ గార్డెన్ నిర్మాణానికి రూ. 9 కోట్ల నిధులు మంజూరయ్యాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాలాపూర్ మండల పరిధిలో గల జల్ పల్లి చెరువు అభివృద్ధికి హెచ్ఎండీఏ నుంచి మంత్రి కేటీఆర్ చొరవతో నిధులు విడుదలయ్యాయని పేర్కొన్నారు. వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు.

జల్ పల్లి చెరువుకు పర్యాటక శోభ కోసం కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు. ఇందులో చెరువు చుట్టూ కట్ట, బౌండరీ, రేలింగ్ కోసం రూ. 2 కోట్ల 17 లక్షల 60 వేలు, పాదచారుల కోసం వాకింగ్ ట్రాక్, పార్కింగ్ కు రూ. కోటి 99 లక్షల 34 వేలు, వ్యూ పాయింట్ నిర్మాణానికి రూ. కోటి 72 లక్షల 70 వేలు మంజూరయ్యాయి. ఫుడ్ కోర్ట్‌, ఇతర ఆక్టివిటీ జోన్ ల నిర్మాణానికి రూ. 61 లక్షల 10 వేలు, లైటింగ్, ఇతర ఎలక్ట్రిక్ పనుల కోసం రూ. 55 లక్షల 39 వేలు, చెరువు వద్ద అద్భుతమైన కళ కండాలు, చిత్రాలు, ఆకారాల కోసం రూ. 55 లక్షల 75 వేలు మంజూరు అయ్యాయని మంత్రి పేర్కొన్నారు.

పనులన్నీ పూర్తయితే ఈ ప్రాంతం పర్యాటక స్వర్గధామంగా మారుతుందన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నాపెద్ద సేదతీరడానికి, నడకకు, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు పర్యటించి ఇచ్చిన సూచనల మేరకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు.

పెద్ద ఎత్తున జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని చెరువుకు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ఆమె ధన్యవాదాలు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.