వర్షాలకు అతలాకుతలమైన జల్పల్లి ప్రాంతంలో బాధితులకు అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టామని పురపాలక కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండి.. అహర్నిశలు కష్టపడ్డామని వెల్లడించారు. బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందనడం సరికాదన్నారు.
ఈ సందర్భంగా బురాన్ఖాన్ చెరువు పరిధి ఎఫ్టీఎల్లో నిర్మించుకున్న ఇళ్లల్లోకి నీరు చేరిందని తెలిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ సహకారంతో బాధితులకు సదుపాయాలను అందించామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి