రంగారెడ్డి జిల్లా జల్పల్లి పురపాలకలో రూ.10.85 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను ఆమోదించినట్లు మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్ వెల్లడించారు. దాదాపు ఐదు నెలల తర్వాత నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో 27 వార్డులకు చెందిన కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పురపాలిక పరిధిలోని అన్ని వార్డులకు సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొవిడ్ వల్ల వాయిదా పడినందువల్ల సమావేశం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, వైస్‌ఛైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లను సన్మానించారు.