రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అఖిల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మంచాల మండలం బోదకొండకు చెందిన ఆమె ఎప్పటిలానే ఈరోజు కూడా కళాశాలకు వెళ్లింది. ఉదయం శౌచాలయానికి వెళ్లి స్పృహ తప్పి పడిపోయింది. యాజమాన్యం విద్యార్థినిని నగరంలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : మహిళ వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య