తెలంగాణలో పీవీ నుంచి మొదలుకొని చాకలి ఐలమ్మ వరకు అందరిని ముఖ్యమంత్రి కేసీఆర్ సముచితమైన రీతిలో గౌరవిస్తున్నారని మంత్రి సబిత తెలిపారు. పెద్ద ఎత్తున భూ పోరాటం చేసి, ఎవరి పంట వారిని అమ్ముకునేల చేసిన ఘనత ఐలమ్మకే సాధ్యమైందని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ పోరాట ఫలితంగా 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిందన్నారు. హక్కుల కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మని కొనియాడారు.
గొప్ప పోరాట యోధురాలి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, శంకర్ పల్లిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఆమె అభినందనలు తెలిపారు. కేసీఆర్ కూడా తెలంగాణ చరిత్రను భావి తరాలకు తెలిసేలా కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణలో అన్ని కుల వృత్తులను గౌరవిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. మరుగున పడిన 17 కులాలను బీసీ జాబితాలో చేర్చారని తెలిపారు. నేడు అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ఐలమ్మ పోరాట పటిమను గుర్తు చేయటం జరిగిందన్నారు.
ఇదీ చూడండి: పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్