ETV Bharat / state

'16 సీట్లు గెలిస్తేనే కాళేశ్వరానికి జాతీయ హోదా'

మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ శ్రేయోభిలాషులు ఆయన పేరిట ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. తన స్వగ్రామం కిస్మత్పూర్​లో జరిగిన ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తెరాస కార్యకర్తలు హాజరయ్యారు.

శ్రేయోభిలాషులు ఆత్మీయ సన్మాన సభ
author img

By

Published : Apr 4, 2019, 10:37 AM IST

కేంద్రంలో ప్రాంతీయ పార్టీలకే కీలక పాత్ర ఉంటుందని శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలోని కిస్మత్పూర్​లో శ్రేయోభిలాషులు ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగినందునే ఉద్యమం మెుదలైందని స్వామి గౌడ్ తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని, పోలవరానికి మాత్రం జాతీయ హోదా ఇచ్చిందని గుర్తు చేశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా రావాలంటే 16 ఎంపీ సీట్లు గెలిపించాలని స్వామిగౌడ్ విజ్ఞప్తి చేశారు.

కాళేశ్వరానికి జాతీయ హోదా రావాలంటే 16 ఎంపీ సీట్లు గెలిపించాలి : స్వామిగౌడ్

ఇవీ చూడండి :భారత్​ భేరి: సిగ్నల్ కోసం ఎన్నికల బహిష్కరణ

Intro:hyd_tg_17_04_Swamigoud sanmanam_ab_c6

Body:రానున్న కాలంలో కేంద్రంలో జాతీయ పార్టీలు ఉండబోవని స్థానిక పార్టీలదే హవా ఉంటుందని మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ జోస్యం చెప్పాడు .నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ వారికి దక్కకుండా ఆంధ్ర వలస వాదులు కొల్లగొట్టడం తోనే తెలంగాణ ఉద్యమం వచ్చిందని కనకమామిడి స్వామి గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం లోని కిస్మత్పూర్ తన స్వగ్రామంలో ఆయన అభిమానులు ఏర్పాటుచేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ ఘటనను గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి. షాదీ ముబారక్. ఆసరా పెన్షన్ లు. రైతుబంధు వంటి పథకాలు ప్రజల ఆదరణ పొంది అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారని గుర్తు చేశారు. జాతీయ హోదా రావాలంటే మనకు 16 ఎంపీ సీట్లు కావాలన్నారు. ఎంపీల బలం ఉంటేనే కేంద్రం జాతీయ హోదా ఇతర ప్రాజెక్టులు సాధించవచ్చన్నారు. అనంతరం చేవెళ్ల తెరాస పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తనకు స్వామి గౌడ్ ఆదర్శం అన్నాడు. ప్రతి ఒక్కరూ కార్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అయితే కేంద్రం నుంచి నిధులు తెచ్చి చేవెళ్ల గడ్డను అభివృద్ధి పరుస్తారని ఆయన తెలిపారు. అంతకుముందు స్వామి గౌడ్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, యువనేత కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ తూ పార్లమెంటులో తెలంగాణ వాణి వినిపించేందుకు కారు సారు 16 నినాదాన్ని నిజం చేయాలన్నారు. కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా తెరాస అధ్యక్షులు నాగేందర్ గౌడ్ అత్తాపూర్ కార్పొరేటర్ విజయ జంగయ్య రాజేంద్రనగర్ కార్పొరేటర్ శ్రీలత మహాత్మా శంషాబాద్ జడ్పిటిసి సతీష్ రాజేంద్రనగర్ ఎంపీపీ తలారి మల్లేష్ ముదిరాజ్ మాధవ రెడ్డి ముంతాజ్ బేగం కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Conclusion:బైట్ ; రంజిత్ రెడ్డి. చేవెళ్ల తెరాస పార్లమెంట్ అభ్యర్థి.
బైట్ ; స్వామిగౌడ్. మాజీ శాసన మండలి చైర్మన్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.