ETV Bharat / state

ఆదుకోమంటూ హెచ్​ఆర్సీని ఆశ్రయించిన చిరు వ్యాపారులు

చిరు వ్యాపారం చేసుకుంటున్న స్థలాన్ని ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని... అదే జరిగితే దాదాపు 36 కుటుంబాలు రోడ్డున పడుతాయని హెచ్​ఆర్సీని ఆశ్రయించారు చిరు వ్యాపార వృత్తి కార్మిక సంక్షేమ సంఘం నాయకులు.

ibrahimpatnam small merchants meet hrc
ఆదుకోమంటూ హెచ్​ఆర్సీని ఆశ్రయించిన చిరు వ్యాపారులు
author img

By

Published : Mar 13, 2020, 4:57 PM IST

చిరు వ్యాపారస్తుల జీవితాలను రోడ్డు పాలు చేయకుండా సంబంధిత అధికారులకు సూచించాలని... రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించింది చిరు వ్యాపార వృత్తి కార్మిక సంక్షేమ సంఘం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం విద్యుత్ కార్యాలయం సమీపంలో గత 30 ఏళ్లుగా దాదాపు 170 మంది చిన్న డబ్బాలను ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారం చేస్తూ... జీవనోపాధి కొనసాగిస్తున్నామని సంఘం నాయకులు... కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

తమను ఖాళీ చేయమని ఈ నెల 2న మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. దాదాపు 36 కుటుంబాలు చిరువ్యాపారం మీదే ఆధారపడి జీవిస్తున్నాయని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఏటా మున్సిపల్ కార్యాలయానికి ఒక్కొక్కరుగా 1800 రూపాయల రుసుము చెల్లిస్తున్నామని వివరించారు. తాము వ్యాపారం చేసుకుంటున్న స్థలాన్ని ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని... ఇదే జరిగితే తమ బతుకులు రోడ్డుమీదకొస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని హెచ్ఆర్​సీని వేడుకున్నారు.

ఆదుకోమంటూ హెచ్​ఆర్సీని ఆశ్రయించిన చిరు వ్యాపారులు

ఇవీ చూడండి: పన్నులు, విద్యుత్‌ ఛార్జీలు పెంచుతాం: కేసీఆర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.