లాక్డౌన్ నిబంధనలను ప్రజలందరూ కచ్చితంగా పాటించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని లష్కర్ గూడ, సుర్మాయిగూడ, ఇనాంగూడ గ్రామాల్లో పేదలకు బియ్యం, గుడ్లు, పండ్లు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
లాక్డౌన్ సందర్భంగా విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు, అధికారులకు గొడుగులు అందజేశారు. అనవసరంగా ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని ఎమ్మెల్యే కిషన్రెడ్డి సూచించారు.
ఇదీ చూడండి : చెయ్యి పైకి లేచిందో... అలారం మోగుద్ది